logo

ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ

రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు.

Updated : 19 Apr 2024 06:21 IST

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, చిత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించిన జహీరాబాద్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వారి ఖాతాల్లో పరిహారం జమచేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో భాజపా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్‌న్యాయ్‌ పేరిట 25 గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకుంటుందని స్పష్టం చేశారు. జహీరాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ.. భాజపా ప్రభుత్వం పదేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. లీటర్‌ పెట్రోల్‌ను రూ.35కే ఇస్తామని చెప్పి వందకు పైగా పెంచారని పేర్కొన్నారు. యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్‌ పదేళ్లుగా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని