logo

సమాచారం అరచేతిలో..

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది.

Published : 24 Apr 2024 05:59 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. వాట్సప్‌ ఛానెల్‌లోకి కేంద్ర ఎన్నికల సంఘం 2023 శాసనసభ ఎన్నికలప్పుడు ప్రవేశించింది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనూ వాట్సప్‌ ఛానెల్‌ వీక్షకులకు వివిధ రకాల సమాచారాన్ని చేరవేస్తోంది. ఓటరు చైతన్య కార్యక్రమాలు, వివిధ యాప్‌ల వివరాలను ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది. సి-విజిల్‌, సువిధ, సాక్ష్యం, కేవైపీ యాప్‌లతో ఎన్నికలకు సంబంధించి సమగ్ర వివరాలను ప్రజలకు సమాచారమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వచ్చే నెల 13న ఎన్నికల నేపథ్యంలో అనేక అంశాలను అందులో పొందుపరిచి సవివరంగా అందుబాటులో ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని