logo

చీపురుపల్లిలో వాలంటీర్లకు తాయిలాలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని వాలంటీర్లకు రెండు రోజులుగా తాయిలాలు గుట్టుగా పంపిణీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఒక్కరికీ రూ.5 వేల చొప్పున అందజేశారు.

Published : 30 Mar 2024 03:02 IST

ఈనాడు, విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని వాలంటీర్లకు రెండు రోజులుగా తాయిలాలు గుట్టుగా పంపిణీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఒక్కరికీ రూ.5 వేల చొప్పున అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 నియోజకవర్గాలకు పది నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాక ముందే ఈ తంతు పూర్తి చేశారు. కొన్నిచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో రూ.5 వేలు నగదుతో పాటు దుస్తుల ప్యాకెట్‌ వారి చేతిలో పెట్టారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకే అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. చీపురుపల్లి నియోజకవర్గంలో జాప్యం జరగడంతో కీలక ప్రజాప్రతినిధి గ్రామాల్లోని పార్టీ నాయకులకు ఈ బాధ్యతను అప్పగించారు. వారు తమ పరిధిలోని వాలంటీర్లను పిలిచి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని