logo

పోలవరం.. అన్యాయంపై నోరు మెదపరేం!

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గింపు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2023 02:09 IST

నిరసన దీక్షలో నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గింపు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గింపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రాజెక్ట్‌ ఎత్తు 150 అడుగులకు బదులు 135కు తగ్గించాలని, 196 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి బదులు 92 టీఎంసీలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిందన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ విషయంలో రాష్ట్రానికి అన్యాయం చోటుచేసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అడ్డుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ అంశంపై సీఎం జగన్‌ స్పందించి అడ్డుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రాజెక్ట్‌ సామర్థ్యాన్ని యథావిధిగా ఉంచి నిర్మాణం పూర్తి చేయాలని నినాదాలు చేశారు. దీక్షలో పార్టీ నాయకులు ఆర్‌.వెంకటరావు, పీవీఆర్‌.చౌదరి, పి.ప్రభాకరరావు, ఎం.రమేష్‌బాబు, పి.రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని