logo

చీకటి జీవోలతో భూముల ఆక్రమణకు కుట్రలు

వైకాపా ప్రభుత్వం తెచ్చిన భూహక్కు సవరణ చట్టం అమలైతే ప్రజలు తమ భూమిపై హక్కును కోల్పోతారని కాపు ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు.

Published : 17 Apr 2024 03:35 IST

మాట్లాడుతున్న ఏసుదాసు, పక్కన మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

దర్శి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం తెచ్చిన భూహక్కు సవరణ చట్టం అమలైతే ప్రజలు తమ భూమిపై హక్కును కోల్పోతారని కాపు ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్‌ ప్రజలను వంచించే జీవో తెచ్చి భూములను లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. మన పూర్వీకుల నుంచి వచ్చిన భూములకు సంబంధించిన పాసు పుస్తకాలపై, పొలాల్లో వేసిన రాళ్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ ఫొటో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అప్పులు తీసుకురావటానికి మన భూములు తాకట్టు పెడతారని ఆరోపించారు. వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే భూములు మాయం అవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవకుమార్‌, నాయకులు శ్రీనివాసమూర్తి, సుబ్బయ్య, చంద్రశేఖర్‌, సురేష్‌బాబు, పాపారావు, సిద్ధు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని