logo

వైభవంగా సీతారాముల కల్యాణం

రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Published : 18 Apr 2024 03:10 IST

మార్కాపురం పట్టణం: సీతారాముల కల్యాణంలో పాల్గొన్న భక్తులు

పొదిలి, పొదిలిగ్రామీణం, మార్కాపురం పట్టణం, గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, కొమరోలు గ్రామీణం, త్రిపురాంతకం గ్రామీణం, యర్రగొండపాలెం:  రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

  • పొదిలిలోని కొత్తూరు, పాతూరులోని రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలో సీతారాముల కల్యాణం జరిపించారు.
  • మార్కాపురంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం, రామాలయాల్లో ఆలయంలో  సీతారాముల కల్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
  • గిద్దలూరులోని సీతారాముల కల్యాణమండపంలో నిర్వహించినకల్యాణోత్సవంలో ముత్తుముల అశోక్‌రెడ్డి దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి దంపతులు పాల్గొన్నారు.
  • బేస్తవారపేట, కొమరోలు, రాచర్ల, కంభం, పెద్దదోర్నాల మండలంలోని  రామాలయాల్లో కల్యాణ కృతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతా వస్త్రాల అలంకరణతో చిన్నారులు ప్రదర్శన భక్తులను అలరించాయి.
  • త్రిపురాంతకంలో ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సీతారాముల స్వాముల శోభాయాత్రను గ్రామంలో నిర్వహించారు.
  • వై.పాలెం పట్టణం పడమటి బజారులోని రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది.
  • యర్రగొండపాలెంలోని బంగారు దుకాణాల బజారులో  సీతారాములకు ప్రత్యేక పూజలు  నిర్వహించారు.
  • కంభం మండలంలోని తురిమెళ్లలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి బుధవారం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

పొదిలిలో భక్తులకు అన్నదానం

వై.పాలెంలో...

త్రిపురాంతకం గ్రామీణం:  శ్రీరాముని శోభాయాత్ర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని