logo

వీధిన పడ్డ బతుకులు

ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది.

Published : 20 Apr 2024 02:34 IST

అయిదేళ్ల పాలనలో యువకులు విలవిల
జీవనం అస్తవ్యస్తం

తర్లుపాడు, న్యూస్‌టుడే : ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. పని చేసుకునే వాడికి పని దొరకదు. చదువుకున్న యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. కార్మికులకు పనులు లేక వలసబాట పడుతున్నారు. అటు సంపాదన లేక ఇటు ఉపాధి లేక యువత విలవిలలాడుతోంది.


ఉపాధి కోల్పోయా.. : జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే భవన నిర్మాణ విభాగంపై కక్ష కట్టి ఇసుక దొరకుండా చేశారు. మా తల్లిదండ్రులు చదివించే స్థోమత లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పని నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి బెల్దారి పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడిని. కానీ వైకాపా వచ్చిన తర్వాత ఇసుక లేకుండా చేయడంతో భవన నిర్మాణం పూర్తిగా నిలిచిపోయి మాలాంటి వారికి ఉపాధి లేకుండా పోయింది. ఇతర పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది.

ఈర్ల గోపి, భవన నిర్మాణ కార్మికుడు, తర్లుపాడు బీసీ కాలనీ


డిగ్రీ పూర్తిచేసినా ఉపయోగమేదీ? : మాది పేద కుటుంబం. మా తల్లిదండ్రులు వసల కూలీలు. పనులు చేసుకుంటూ నన్ను చదివించారు. అప్పులు చేసి నన్ను చదివిస్తే డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగమేదీ రాలేదు. జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏవీ రాలేదు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇస్తుందోమోనని శిక్షణ తరగతులకు వెళ్తే నేటికీ ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. నిరుద్యోగిగా తల్లిదండ్రులకు భారంగా మారాను.  

పెద్ద తిరుపతయ్య, నిరుద్యోగ యువకుడు, తర్లుపాడు


బిందు సేద్యం లేక.. ఇబ్బంది : పశ్చిమ ప్రకాశం వర్షాధారిత ప్రాంతం. ఇక్కడ నిత్యం వర్షాలు కురిస్తేనే పంటలు పండేది అంతంత మాత్రమే. బోర్లు వేస్తే వందల అడుగుల లోతుకు తవ్వితే గానీ నీళ్లు బయటకు రావు. ఇలాంటి ప్రాంతానికి గత తెదేపా ప్రభుత్వం 90 శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు ఇవ్వడంతో ఫిట్టర్‌గా మాలాంటి యువకులకు నిత్యం పని ఉండేది. సూక్ష్మసేద్యం వల్ల రైతులకు నీటి ఇబ్బందులతో పాటు స్థానిక యువతకు ఉపాధి ఉండేది. కానీ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అయిదేళ్లలో సక్రమంగా డ్రిప్‌ పైపులు ఇవ్వకపోవడంతో రైతులకు పంట నష్టాలతో పాటు మాలాంటి వారు ఉపాధిని కోల్పోయి ఏ పని చేయలేకున్నాం.

రాజారపు గురవయ్య, డ్రిప్‌ ఫిట్టర్‌, మీర్జాపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని