logo

తెదేపా విజయానికి కృషి చేయాలి

పలాసలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజాగళం సభకు విశేష స్పందన లభించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 17 Apr 2024 05:07 IST

శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం  

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం: పలాసలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజాగళం సభకు విశేష స్పందన లభించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముంగిట విజయమే లక్ష్యంగా శ్రమించేందుకు ఇది దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పలాస వచ్చిన చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి గౌతు శిరీష నివాస ప్రాంగణం వద్ద బస్సులో బస చేశారు. ఆ సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వైకాపా నాయకులు చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మంగళవారం ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధినేతను కలిసేందుకు తరలివచ్చారు. రెండోరోజూ చేరికలు జరిగాయి. దీంతో సందడి వాతావరణం నెలకొంది. తెదేపాపై పలాసలో ప్రజల ఆదరణ పెరిగిందని మరింత కష్టపడి పనిచేసి విజయం సాధించాలని శిరీషకు చంద్రబాబు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ దంపతులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తొలుత శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులు, నాయకులతో సమీక్ష సమావేశం ఉంటుందని అనుకున్నా రద్దయింది. ఉదయం 10:40 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్‌లో పలాస నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు