logo

పాలకుల నిర్లక్ష్యం.. యువత శ్రమదానం

బూర్జ మండలం నీలాదేవిపురం కూడలి, శ్రీకాకుళం- పాలకొండ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను టీఆర్‌రాజుపేట, సంకురాడకు చెందిన యువత సిమెంటు, పిక్కరాయితో బుధవారం పూడ్చారు.

Updated : 18 Apr 2024 06:29 IST

నీలాదేవిపురం సమీపంలో గుంతలు పూడ్చుతున్న విద్యార్థులు
బూర్జ మండలం నీలాదేవిపురం కూడలి, శ్రీకాకుళం- పాలకొండ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను టీఆర్‌రాజుపేట, సంకురాడకు చెందిన యువత సిమెంటు, పిక్కరాయితో బుధవారం పూడ్చారు. ఈ ప్రదేశంలో నిత్యం  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ గుంతల వద్దనే బూర్జ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ సురేష్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి శ్రీకాకుళం నుంచి పాలకొండ వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు గుంతలు కారణంగా అదుపు తప్పాయి. దీంతో రెండు వాహనాలు వెనుక కూర్చున్న ఇద్దరు మహిళలు తీవ్ర గాయాల పాలై శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయినా పాలకుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో యువత శ్రమదానం చేపట్టారు. వారిని పలువురు అభినందించారు. 

 - న్యూస్‌టుడే, బూర్జ  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని