logo

అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ

అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Published : 19 Apr 2024 04:38 IST

జమ్ములో మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో తెదేపా నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, జలుమూరు, న్యూస్‌టుడే: అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. నరసన్నపేట మండలం జమ్ము, జలుమూరు మండలంలోని రాణా, పెద్దదూగాం, కరవంజ, గుగ్గిలి, గుండువలస, ఈదులవలస, బసివాడ, టెక్కలిపాడు గ్రామాల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తితో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన జగన్‌ ప్రజలను మోసగించారన్నారు. ప్రతి ఒక్కరూ ఓటుతో వైకాపా నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెదేపా అధినేత అమలు చేయనున్న సూపర్‌-6 పథకాలను స్థానికులకు వివరించారు. తెదేపా, జనసేన, భాజపాలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఉపాధి వేతనదారులతో సమావేశమయ్యారు. కూటమి నాయకులు రెడ్డి సతీష్‌, దుంగ సింహాచలం, శిమ్మ చంద్రశేఖర్‌, వెలమల రాజేంద్రనాయుడు, బలగ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు