logo

ఎలమంచిలిలో అమ్మవారి ఉత్సవాలు నేటి నుంచి

పట్టణంలో ప్రసిద్ధిచెందిన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆదివారం నుంచి లాంఛనంగా ప్రారంభించడానికి ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఏటా మార్గశిర మాసంలో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

Published : 05 Dec 2021 05:50 IST
ముస్తాబు చేసిన అమ్మవారి విగ్రహం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలో ప్రసిద్ధిచెందిన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆదివారం నుంచి లాంఛనంగా ప్రారంభించడానికి ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఏటా మార్గశిర మాసంలో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. గ్రామీణ జిల్లాలో ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. కొఠారు రాంబాబు కుటుంబీలు వీటిని నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి గురువారం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. చివరి రోజు భారీ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు లక్షమందికి పైగా భక్తులు వస్తారని అంచనా. రాజీవ్‌ క్రీడామైదానంలో నిర్వహించే జాతరలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ కొఠారు సాంబశివరావు చెప్పారు. ఆలయ అర్చకులు కోటేశ్వరశర్మ ప్రతిరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. ఛైర్మన్‌ సాంబ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొఠారు కొండబాబు, మడగల సత్యనారాయణ తదితరులు శనివారం ఆలయం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని