logo

సంపూర్ణ గృహ హక్కు పథకం

 జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్‌టైమ్‌ సెటిల్‌ మెంట్‌(ఓటీఎస్‌) వసూళ్లకు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ శనివారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మూడు రోజుల క్రితం గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారుల

Published : 05 Dec 2021 05:50 IST

పాడేరు, న్యూస్‌టుడే: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్‌టైమ్‌ సెటిల్‌ మెంట్‌(ఓటీఎస్‌) వసూళ్లకు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ శనివారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మూడు రోజుల క్రితం గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారుల నుంచి తనకు ఓరల్‌గా సమాచారం అందినట్లు చెప్పారు. దీనిపై లిఖిత పూర్వక ఆదేశాలేవీ రాలేదన్నారు. ఈ మేరకు ఏజెన్సీలో ఎక్కడా ఓటీఎస్‌ వసూళ్లు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఓటీఎస్‌కు వెసులుబాటు కల్పించాలని ఎంపీ మాధవితో పాటు పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఫాల్గుణ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని