logo

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో గందరగోళం

ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు.

Published : 10 May 2024 04:12 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు. వీరిలో అత్యవసర విభాగానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. పోలీసులకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఉందని చెప్పడంతో వీరంతా ఏపీవో మధుసూదనరావుతో వాగ్వాదానికి దిగారు. అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనంతో వెనుతిరిగారు. కావాలనే ఓటు వేయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 100 మంది ఉద్యోగులు ఓటు వేయకుండానే వెనుతిరిగినట్లు తెలుస్తుంది. రిటర్నింగ్‌ అధికారిణి, జేసీ జాహ్నవి దృష్టికి తీసువెళ్లడంతో కేవలం పోలీసులకు మాత్రమే అవకాశం ఉందని మిగిలిన వారికి అవకాశం లేదని తేల్చిచెప్పడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. నోడల్‌ అధికారిణి రోజారాణి సైతం చేతులెత్తేయడంతో మండిపడ్డారు. ఏపీవోలు, పీవోలకు 7, 8 తేదీలు కేటాయించామని వారు ఆ రోజుల్లో రాకుండా నేడు ఆందోళన చేయడం తగదన్నారు. నిబంధనలు ప్రకారమే ఓటింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకోలేని వారు 13న సొంత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయచ్చన్నారు. ఆరోజు సెలవు ఇస్తారన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని