logo

రాంబిల్లి బ్యాంక్‌లో చోరీ యత్నం

రాంబిల్లిలోని స్టేట్‌బ్యాంకులో శనివారం రాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక కిటికీ తొలగించి లోపలికి ప్రవేశించారు. లాకర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నాలుగు

Published : 06 Dec 2021 02:14 IST

ఎలమంచిలి, (రాంబిల్లి), న్యూస్‌టుడే: రాంబిల్లిలోని స్టేట్‌బ్యాంకులో శనివారం రాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక కిటికీ తొలగించి లోపలికి ప్రవేశించారు. లాకర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నాలుగు నెలల కిందట ఇదే బ్యాంకులో దొంగలు చోరీకి యత్నించారు.. సీసీ కెమెరాల్లో నిందితులు బ్యాంకులోకి ప్రవేశించడం రికార్డు అయ్యింది. అప్పుడు, ఇప్పుడు కూడా బ్యాంక్‌లో ఏమీ పోలేదు. ఆదివారం  స్థానిక సీఐ వెంకటరమణ బ్యాంకును పరిశీలించి అధికారులతో మాట్లాడారు. చోరీ యత్నంపై ఫిర్యాదు చేయలేదని సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని