logo

గంజాయి తోటల్లో ప్రత్యామ్నాయ పంటలు

ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా ఇటీవల ధ్వంసం చేసిన గంజాయి తోటల స్థానంలో కాఫీ, సిల్వర్‌ ఓక్‌ నర్శరీలు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ

Published : 19 Jan 2022 05:23 IST
రైతులకు పవర్‌ వీడర్లు పంపిణీ చేస్తున్న పీవో గోపాలకృష్ణ, ఎమ్యెల్యే భాగ్యలక్ష్మి, ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు

పాడేరు, న్యూస్‌టుడే: ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా ఇటీవల ధ్వంసం చేసిన గంజాయి తోటల స్థానంలో కాఫీ, సిల్వర్‌ ఓక్‌ నర్శరీలు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబులతో కలిసి 58 మంది రైతులకు ఆమె పవర్‌ వీడర్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కాఫీ సాగును జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో సేకరించిన రైతుల జాబితా ప్రకారం 90 శాతం రాయితీపై యూనిట్లను అందించినట్లు చెప్పారు. పాడేరు ఎంపీపీ సోనారి రత్నకుమారి, ఉప ఎంపీపీ కనకాలమ్మ, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ గాయిత్రి, సర్పంచి కొట్టగుళ్లి ఉషారాణి, ఉద్యానశాఖాధికారి బిందు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని