logo

47 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌

కొవిడ్‌ కేసులు రోజురోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. అన్ని వర్గాల వారు వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలను తెరుస్తున్నారు. కొవిడ్‌ కేసులకు

Published : 19 Jan 2022 05:28 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: కొవిడ్‌ కేసులు రోజురోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. అన్ని వర్గాల వారు వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలను తెరుస్తున్నారు. కొవిడ్‌ కేసులకు భయపడి విద్యార్థులు చాలామంది స్కూళ్లకు రావడానికి భయపడుతున్నారు. ఉపాధ్యాయులు కూడా కరోనాబారిన పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే 29 మంది టీచర్లకు కొవిడ్‌ సోకినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం మరో 18 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యా శాఖ అప్రమత్తమయింది. పాఠశాలల్లో తప్పకుండా కొవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని