logo

24 గంటల్లోనే 2244 కొవిడ్‌ కేసులు

జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధరణ అవుతోంది. గురువారం

Published : 22 Jan 2022 02:15 IST

రాష్ట్రంలోనే అత్యధికం

విశాఖపట్నం, పాడేరు, రావికమతం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధరణ అవుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో విశాఖ జిల్లాలో అత్యధికంగా 2244 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5634 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. పాజిటివిటీ శాతం 39.83శాతంగా నమోదైంది. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా నెగిటివ్‌గా తేలింది. రావికమతం తహసీల్దారు కార్యాలయంలో 10 మంది ఉద్యోగులు, మరుపాక మోడల్‌ స్కూలు ప్రిన్సిపల్‌ సహా 21 మంది కరోనా బారినడ్డారు. మన్యంలో తాజాగా 56 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌ తెలిపారు. అత్యధికంగా హుకుంపేట ఆసుపత్రి పరిధిలో 33 కేసులు నమోదు కాగా.. మినుములూరు పీహెచ్‌సీ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. మూడు రోజుల క్రితం ఐటీడీఏ ఉన్నతాధికారి డ్రైవర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. తాజాగా ఆ అధికారికి సైతం పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని