logo

ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలి

ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్‌ రిజిస్ట్రార్లతో వీసీ నిర్వహించారు.

Published : 23 Jan 2022 05:51 IST


వీడియో సమావేశంలో పాల్గొన్న గృహనిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్‌ రిజిస్ట్రార్లతో వీసీ నిర్వహించారు. ఈ పథకం ద్వారా వచ్చే లబ్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, దీనికోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఓటీఎస్‌ వసూళ్లలో ముందున్న మండలాల అధికారులను కలెక్టర్‌ అభినందించారు. రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలపై ఆర్డీవోలు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఇబ్బందులుంటే గృహనిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. వీసీలో గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని