logo

చిత్ర వార్తలు

బంగ్లాదేశ్‌ నౌక ‘ఎంవీ మా’ దాదాపు ఏడాది కిందట తుపానుకు విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ నౌక రూపే మారిపోయింది. పర్యాటకంగా అభివృద్ధి చేసే పనులు సాగుతున్నాయి. దీంతో కొత్తగా రంగులు వేసి ముస్తాబు చేశారు.

Published : 25 Jan 2022 05:55 IST

‘మా’రింది

బంగ్లాదేశ్‌ నౌక ‘ఎంవీ మా’ దాదాపు ఏడాది కిందట తుపానుకు విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ నౌక రూపే మారిపోయింది. పర్యాటకంగా అభివృద్ధి చేసే పనులు సాగుతున్నాయి. దీంతో కొత్తగా రంగులు వేసి ముస్తాబు చేశారు.

- ఈనాడు, విశాఖపట్నం


ప్రమాదం... రాళ్ల రూపంలో!!

తీరంలో జోడుగుళ్లపాలెం సమీపంలోని కొండపై నుంచి పడుతున్న రాళ్లు ఈ మార్గంలో ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. ఈ దారి నిత్యం రద్దీగా ఉంటుంది.  ఉదయం...సాయంత్రం  ఆహ్లాద వాతావరణంలో జనం నడుస్తుంటారు. ఎప్పుడు ఏ రాయి మీదికి దూసుకొచ్చేస్తుందో...ప్రమాదం ఎలా విరుచుకుపడుతుందోనని వారు కలవరపడుతున్నారు.

 - ఈనాడు, విశాఖపట్నం


ఇదో... ప్రయత్నం

గురుద్వారా సమీపంలోని ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయ భవనంలో లిఫ్టు వద్ద ఓ స్పాంజ్‌ ఏర్పాటు చేసి ‘టూత్‌పిక్‌’లను దానికి గుచ్చి ఉంచారు. లిఫ్టు ఎక్కేవారు బటన్లు నొక్కేందుకు వీటిని ఉపయోగించేలా ఇలా ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి ఇదో చిన్న ప్రయత్నమని చెబుతున్నారు.

-ఈనాడు, విశాఖపట్నం


సాగర తీరంలో హరివిల్లు సోయగం

ప్రకృతి ప్రేమికుల మదిని దోచే సముద్ర తీరాన నీలాకాశంలో హరివిల్లు కనువిందు చేసింది. అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో సోమవారం కనిపించిన ఇంద్రధనుస్సు సందర్శకులు, మత్స్యకారులను ఆకట్టుకుంది. ఈ అద్భుత దృశ్యాన్ని యువకులు సెల్‌ఫోన్లలో బంధించారు.

- అచ్యుతాపురం, న్యూస్‌టుడే


రోలుగుంట మండలం నిండుగొండలో గౌరీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన ముగింపు సంబరాలు సోమవారం సారె అప్పగింతలతో ముగిశాయి.

- న్యూస్‌టుడే, రోలుగుంట


కంఠవరంలో షూటింగ్‌ సందడి

సొలభం పంచాయతీ కంఠవరం వద్ద మత్స్యగెడ్డలో సోమవారం సినిమా షూటింగ్‌ జరిగింది. నిహారిక బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదని డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ తెలిపారు. హీరోగా సంతోష్‌బాబు, హీరోయిన్‌గా పైరా నటిస్తున్నారని చెప్పారు. మత్స్యగెడ్డలో నటుడు బ్రహ్మాజీపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు.

-జి.మాడుగుల, న్యూస్‌టుడే


చెట్టు కిందే చికిత్స

నసపుట్టు పంచాయతీలోని కడుతులలో సోమవారం చెట్టు కిందే వైద్య శిబిరం నిర్వహించారు. లబ్బూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, 104 సిబ్బంది ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ఉండటంతో గ్రామ వాలంటీరు త్రినాథ్‌, ఆశ కార్యకర్తల సమాచారం మేరకు వైద్యాధికారులు ప్రతాప్‌, ప్రణీత్‌ రోగులకు సేవలు అందించారు. చెట్టు కిందే శిబిరం ఏర్పాటుతో రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

-ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని