logo

సమగ్ర భూసర్వేతో రైతులకు న్యాయం

సమగ్ర భూసర్వేతో రైతులందరికి సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములు ఆన్‌లైన్‌ చేయడం వలన పక్కా కొలతలతో హక్కుపత్రం లభిస్తుందన్నారు. మీ భూమి - మా హామీ భూరక్ష పథకంలో భాగంగా కశింకోట మండలం తేగాడలో

Published : 13 Aug 2022 04:35 IST

ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

తేగాడలో మాట్లాడుతున్న అజేయ కల్లం, వేదికపై జేసీ, అధికారులు

కలెక్టరేట్‌, కశింకోట, న్యూస్‌టుడే: సమగ్ర భూసర్వేతో రైతులందరికి సమన్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములు ఆన్‌లైన్‌ చేయడం వలన పక్కా కొలతలతో హక్కుపత్రం లభిస్తుందన్నారు. మీ భూమి - మా హామీ భూరక్ష పథకంలో భాగంగా కశింకోట మండలం తేగాడలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సర్వే వల్ల భూసమస్యలు పరిష్కారమవుతాయని, స్థల యజమాని పేరు పక్కాగా నమోదవుతుందన్నారు. 2024 నాటికి శాశ్వత భూమిహక్కు పత్రం వస్తుందని పేర్కొన్నారు. రైతులతో మమేకమై వారి సందేహాలను నివృత్తి చేశారు. శాశ్వత భూహక్కు సర్వేపై రైతులంతా తమ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈయన వెంట సంయుక్త కలెక్టరు కల్పనాకుమారి, భూసర్వే ఏడీ శ్రీనివాస్, ఆర్డీవో చిన్ని కృష్ణ, తేగాడ సర్పంచి ఈశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు మంగతాయారు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల ముందంజ: అంతకుముందు అజేయ కల్లం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమగ్ర భూ సర్వేలో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలు ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో రీ సర్వే చేస్తున్నామని, 10 వేల మంది గ్రామ సర్వేయర్లను ఇందుకోసం నియమించుకున్నామని చెప్పారు. అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో దాదాపు 30 శాతం డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో నేవీ, ఆర్మీ భూములకు సంబంధించి సర్వేకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. అనంతరం కలెక్టర్‌, జేసీ, రెవెన్యూ అధికారులు అజేయ  కల్లంను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖ జిల్లాల జేసీలు కల్పనాకుమారి, విశ్వనాథ్‌, డీఆర్వో వెంకటరమణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని