logo

తొమ్మిది నుంచి ‘విశాఖ విస్టా’

ఆంధ్రవిశ్వవిద్యాలయం, రోటరీ ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 11వరకు రోటరీ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో విశాఖ-విస్టా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ తెలిపారు.

Published : 08 Dec 2022 05:35 IST

సునీల్‌ గవాస్కర్‌ చేతుల మీదుగా ప్రారంభం

వివరాలు వెల్లడిస్తున్న ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం, రోటరీ ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 11వరకు రోటరీ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో విశాఖ-విస్టా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ తెలిపారు. రోటరీ ఇనిస్టిట్యూట్‌ ప్రోగ్రాం కన్వీనర్‌ డాక్టర్‌ మహేష్‌ కొట్బాగి, ఛైర్మన్‌ పి.డి.జి. కిశోర్‌ కుమార్‌తో కలసి బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయం సెనేట్‌ మందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఓ హోటల్‌లో మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. రెండో రోజు కార్యక్రమాన్ని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, పద్మభూషణ్‌ కృష్ణ ఎల్లా, సుభాష్‌ఘై, రోటరీ ఇంటర్నేషనల్‌ అధ్యక్షురాలు జన్నిఫర్‌ జోన్స్‌ (కెనడా), రోటరీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ నామ్నీ స్టెఫీన్‌ యుర్చిక్‌, పూర్వ అధ్యక్షులు శేఖర్‌ మెహత వంటి వారు హాజరవుతున్నట్లు తెలిపారు. 11వ తేదీన బీచ్‌ రోడ్డులోని కాళీమాతా గుడి నుంచి ఎనిమిది వేల మందితో 10కె రన్‌ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. మహిళా సాధికారత, తదితర అంశాలపై ప్రసంగాలు ఉంటాయన్నారు. దీంతో పాటు సుమారు రూ. 2.50 కోట్లు విలువల గల వివిధ పరికరాలను లబ్ధిదారులకు ఇవ్వనున్నారన్నారు. సుమారు 50 దేశాల నుంచి రోటరీ ఇంటర్నేషన్‌ సంస్థ ప్రతినిధులు వస్తున్నారన్నారు. మనదేశంలో అన్ని ప్రాంతాల నుంచి వెయ్యిమందికి పైగా ప్రతినిధులు వస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని