logo

ఖజానా అధికారులకు టోకరా

ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేస్తున్న ఉప, సహాయ ఖజానా (ఎస్టీఓ, ఏటీఓ) అధికారులకు కొంతమంది అనిశా(అవినీతి నిరోధక శాఖ) అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది.

Published : 29 Jan 2023 05:29 IST

అనిశా అధికారులమంటూ ఫోన్లు
రూ.40వేలు ముట్టజెప్పిన ఓ ఎస్టీఓ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేస్తున్న ఉప, సహాయ ఖజానా (ఎస్టీఓ, ఏటీఓ) అధికారులకు కొంతమంది అనిశా(అవినీతి నిరోధక శాఖ) అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది. ‘విజయవాడలోని అనిశా ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నాం? మీపై పలు ఫిర్యాదులున్నాయి, ఇంకా మీకు చాలా సర్వీసు ఉంది. ఏదో ఒకటి చేసుకొని కేసులను ముగించుకోండి. లేదంటే ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తుంది’ అని నలుగురు ఎస్టీఓలు, ఒక ఏటీఓకు ఫోన్లు వచ్చాయి. అనకాపల్లి జిల్లాలోని ఓ ఎస్టీఓకు ఫోను చేసిన వ్యక్తి రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. తన వద్ద అంత డబ్బు లేదని, బ్యాంకు ఖాతాలో రూ.40వేలు ఉందని చెప్పడంతో ఆ మొత్తాన్ని పంపాలని సూచించారు. దీంతో సదరు అధికారి రూ.40వేల నగదు ఫోన్‌పే ద్వారా పంపారు.

* తదుపరి ఆరా తీయగా అవన్నీ నకిలీ కాల్స్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారులకు ఇలాంటి ఫోన్లు రాగా, కొంత మంది భయపడలేదని, కొందరు భయపడి ఎంతో కొంత ముట్టజెప్పినట్లు సమాచారం. పైకి మాత్రం ఖజానా శాఖ అధికారులెవరూ ఈ విషయమై మాట్లాడడం లేదు. ఫిర్యాదులూ చేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని