logo

అనకాపల్లి కళల పుట్టినిల్లు

కళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. స్థానిక వి.వి.రమణ రైతు భారతిలో సోమవారం రాత్రి ఉభయ తెలుగురాష్ట్రాల జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌ ఆహ్వాన నాటికల పోటీలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

Published : 21 Mar 2023 03:28 IST

సినీనటుడు త్రినాథ్‌ను సత్కరిస్తున్న ప్రసాదు, సతీష్‌కుమార్‌ తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: కళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. స్థానిక వి.వి.రమణ రైతు భారతిలో సోమవారం రాత్రి ఉభయ తెలుగురాష్ట్రాల జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌ ఆహ్వాన నాటికల పోటీలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పట్టణం కళలకు పుట్టినిల్లని, ఇక్కడ కళాకారులను ఎంతో ఆదరిస్తారని తెలిపారు. పరిషత్‌ కార్యదర్శి పీలా చిన్ననాయుడు మాట్లాడుతూ మూడు రోజులు ప్రదర్శనలు ఉంటాయన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఉత్తమ నటుడు, నటి వంటి వ్యక్తిగత బహుమతులు అందిస్తామని తెలిపారు. పోటీల నిర్వాహకులు బొడ్డేడ జగతిరావు, మాజీ కౌన్సిలర్‌ కె.ఎం.నాయుడు, గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శిలపరశెట్టి బాబి, నిర్వాహకులు భీశెట్టి కృష్ణ అప్పారావు, రాపేటి నారాయణరావు, మళ్ల లోకేష్‌, వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు విల్లూరి రాము పాల్గొన్నారు.

నాటకరంగం కన్నతల్లి లాంటిది

మునగపాక, న్యూస్‌టుడే: నాటకరంగం కన్నతల్లిలాంటిందని సినీనటుడు, ఎఫ్‌.ఎం. బాబాయి దాడి త్రినాథస్వామి అన్నారు. మునగపాక నందీశ్వరప్రాంగణం తులసీ కళావేదికపై గ్రామీణ యువజన సాంస్కృతిక సంస్థ, గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆయనను రాష్ట్ర గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌, వైద్యుడు పెతకంశెట్టి సతీష్‌కుమార్‌, సూరిశెట్టి రాము, గ్రామస్థులు సత్కరించారు. అనంతరం భూమిక థియేటర్‌ వారు హైదరాబాద్‌ నిర్వహించిన ‘బరిబత్తుల రాజు’ నాటికను ప్రదర్శించారు.  ఈ సందర్భంగా త్రినాథ్‌ స్వామి మాట్లాడుతూ వాడ్రాపల్లిలో జన్మించిన తాను నందీశ్వర ప్రాంగణంలోనే ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థాయికి ఎదిగానన్నారు. గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాదు, వైద్యుడు సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ యువత నాటక రంగాన్ని ఆదరించాలని కోరారు. గ్రామీణ యువజన సాంస్కృతిక సంస్ధ అధ్యక్షుడు సూరిశెట్టి రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ, సర్పంచి అప్పారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని