logo

కష్టపడి చదివితే... విజయాలు సొంతం

సామాజిక మాధ్యమాల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో నేటితరం విద్యార్థులు‘ ఈనాడు’ పత్రిక పఠనంపై దృష్టి సారించాలని, వర్తమాన అంశాలపై

Published : 29 Mar 2023 03:15 IST

జిల్లా సమగ్ర శిక్షాభియాన్‌ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు
‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీలు

బహుమతులు అందుకున్న విద్యార్థులతో సమగ్ర శిక్షాభియాన్‌ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే : సామాజిక మాధ్యమాల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో నేటితరం విద్యార్థులు‘ ఈనాడు’ పత్రిక పఠనంపై దృష్టి సారించాలని, వర్తమాన అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని జిల్లా సమగ్ర శిక్షాభియాన్‌ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గోపాలపట్నం శ్రీమురళీకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ.... విద్యార్థులు కష్టపడేతత్వాన్ని అలవర్చుకుంటే విజయాలు సొంతమవుతాయన్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, వర్తమాన అంశాలపై విద్యార్థులకు క్విజ్‌, వ్యాసరచన, స్టోరీ టెల్లింగ్‌, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పాఠశాలల నుంచి 8, 9వ తరగతులు చదివే విద్యార్థులు హాజరయ్యారు. ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చిన తమలోని ప్రతిభను  చక్కగా ఆవిష్కరించారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు సమగ్ర శిక్షాభియాన్‌ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో విశాఖపట్నం ‘ఈనాడు’ యూనిట్ మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసులు, కళాశాల కరస్పాండెంట్ నిరంజన్‌సాయి ప్రసన్నకుమార్‌, ప్రిన్సిపల్‌ బి.శ్యామ్‌ వల్లభరావు, అధ్యాపకులు పి.అనూష, వి.మహాలక్ష్మి, కె.రజిత, ఎం.ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

చిత్రలేఖనం, క్విజ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

తొలి మూడు స్థానాల్లో విజేతల వివరాలు..

స్టోరీటెల్లింగ్‌ : ఎస్‌.స్వాతి (మహాత్మా విద్యానికేతన్‌, ఆరిలోవ), పి.యురేకా (జీవీఎంసీ ఉన్నత పాఠశాల, అనకాపల్లి), టి.లక్ష్మణ్‌(భాష్యం, అనకాపల్లి)

వ్యాసరచన : ఎ.హైమ లక్ష్మణ కుమారి, (జిల్లా పరిషత్‌ పాఠశాల, నర్సీపట్నం), వి.రోషిణి (జిల్లా పరిషత్‌ పాఠశాల, అనకాపల్లి) ఆర్‌.భస్మిత (జిల్లా పరిషత్‌ పాఠశాల, నర్సీపట్నం)

చిత్రలేఖనం : బి.భావన (యాపిల్‌ స్కూల్‌, గాజువాక), ఎస్‌.మేఘన (శ్రీఅంజనా స్కూల్‌, ఆరిలోవ), వికాస్‌ ప్రసాద్‌ (విజ్ఞాన్‌ టాలెంట్ స్కూల్‌, ఆరిలోవ)

క్విజ్‌ : ఎస్‌.వీ.వంశీకృష్ణ (శ్రీచైతన్య, పెందుర్తి), ఆర్‌.ఎస్‌.ఎస్‌.సంహిత (ఎన్‌ఆర్‌ఐ స్కూల్‌, చినముషిడివాడ), కె.రాకేష్‌ (భాష్యం, నర్సీపట్నం).

పోటీలో భాగంగా కథ చెబుతున్న బాలిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని