logo

వివాదాస్పదం.. ముదపాక వ్యవహారం

పెందుర్తి మండలం ముదపాకలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం’ భూసమీకరణలో రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి.

Updated : 29 May 2023 06:42 IST

 రైతులకు ఎల్‌వోపీసీలు ఇవ్వడంలో అలసత్వం

ఈనాడు, విశాఖపట్నం: పెందుర్తి మండలం ముదపాకలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం’ భూసమీకరణలో రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. భూములు ఇచ్చిన నిజమైన రైతుల పేర్లకు బదులు ఇతరులవి ఉండడం, కొందరికి ఎల్‌వోపీసీ (భూ యాజమాన్య హక్కు సమీకరణ పత్రాలు) ఇవ్వకపోవడం వంటివి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం తీరుతో పలువురు రైతులు తీవ్రంగా విసిగిపోయారు. వీరు చేస్తున్న పనులను సహించలేని సామాన్య రైతులు పోరాడలేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్థితికి వచ్చారు. న్యాయస్థానం ఇక్కడి వ్యవహారాల మీద ఏకంగా అడ్వకేట్‌ కమిషన్‌ను నియమించే పరిస్థితికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. కేవలం అధికారుల అత్యుత్సాహమే దీనికి కారణమైంది. ఫలితంగా నేరుగా కలెక్టరు వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చింది. వీటన్నింటి కారణంగా పెందుర్తి తహసీల్దార్‌ ఆనందకుమార్‌ను బదిలీ చేశారంటున్నారు.  అధికారులు మాత్రం త్వరలో జరిగే బదిలీల్లో భాగంగానే చేశామని పేర్కొంటున్నారు.

సముదాయించి ఉంటే..

కోర్టుధిక్కారంపై అడ్వకేట్ కమిషన్‌ విచారణ

ముదపాక భూసమీకరణ పనుల్లో కోర్టు ధిక్కరణపై హైకోర్టు అడ్వకేట్‌ కమిషన్‌ను నియమించగా ఆ కమిషన్‌ వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం న్యాయస్థానం సెలవుల కారణంగా ఆ నివేదిక బయటకు రాలేదు. అధికారులు ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా అనేది ఆ కమిషన్‌ పరిశీలించింది. ఈ కమిషన్‌ వచ్చి వెళ్లాక పెందుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల కిందట మండల సర్వేయర్‌ను మార్చారు. తాజాగా తహసీల్దార్‌ను బదిలీ చేశారు. కలెక్టర్‌ మల్లికార్జున పెందుర్తి తహసీల్దార్‌ వ్యవహారంలో చూసీచూడనట్లు ఉన్నారన్న విమర్శలు బాహాటంగానే వచ్చాయి.

ఇద్దరు తహసీల్దార్ల ఆకస్మిక బదిలీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన పరమైన అంశాల ఆధారంగా వారిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెందుర్తి తహసీల్దార్‌ ఎం.ఆనందకుమార్‌ భూ వ్యవహారాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ బదిలీలు జరుగుతున్న వేళ కలెక్టర్‌ ఆకస్మికంగా ఆయన్ను సీతమ్మధార తహసీల్దార్‌గా పంపించారు. అక్కడ పనిచేస్తున్న శ్యామ్‌ను పెందుర్తి తహసీల్దార్‌గా బదిలీ చేశారు. రెవెన్యూశాఖలో ఈనెల 31న బదిలీలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అంతకు ముందే వీరిద్దర్నీ మార్చడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో మూడు తహసీల్దార్‌ క్యాడర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భీమిలి ఆర్డీఓ కార్యాలయ ఏఓ, ల్యాండ్‌సీలింగ్‌ విభాగ ప్రత్యేక తహసీల్దార్‌, కలెక్టరేట్‌లోని డీ సెక్షన్‌ విభాగ సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి పలువురు తహసీల్దార్లను బదిలీ చేయాలని కలెక్టర్‌ భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని