logo

కేశఖండనకు 4 గంటలు.. దర్శనానికి 3 గంటలు

సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Published : 04 Jun 2023 05:49 IST

భక్తజన సందోహంగా సింహాచల క్షేత్రం

మండుటెండలో కేశఖండనశాల వద్ద బారులుతీరిన భక్తులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి విశాఖతో పాటు ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కుటుంబాలతో సహా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలిరావడంతో సింహగిరి భక్తజన సందోహంగా మారింది. కేశఖండన మొక్కుబడి చెల్లించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయి బయటకు వచ్చాయి. భక్తులు గంగధారకు వెళ్లే మార్గం నుంచి లోవతోట వరకు మండుటెండలోనే నిరీక్షించారు. దేవస్థానం అధికారులు లోవతోటలో టెంటు ఏర్పాటు చేసినప్పటికీ ఒకవైపు ఒరిగిపోయి సగం మంది ఎండలోనే ఉండాల్సి వచ్చింది. చిన్నారులు, వృద్ధులు ఎండకు తాళలేక నానా అవస్థలు పడ్డారు. దేవస్థానానికి దర్శనం టికెట్ల ద్వారా రూ.20.10లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.10.57లక్షలు, కేశఖండన ద్వారా రూ.3.93 లక్షలు ఆదాయం సమకూరింది. అన్ని విభాగాల ద్వారా ఒక్కరోజే రూ.38.85 లక్షల ఆదాయం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని