logo

రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు.

Published : 28 Mar 2024 02:47 IST

మాట్లాడుతున్న అయ్యన్న, చిత్రంలో పీలా, బుద్ధ

అనకాపల్లి, న్యూస్‌టుడే: యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. బుధవారం తెదేపా, జనసేన, భాజపా నాయకుల సమావేశం జరిగింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పొత్తులో భాగంగా ఎంపీ టికెట్‌ భాజపా అధిష్ఠానం సీఎం రమేష్‌కు కేటాయించిందని చెప్పారు. ఆయన ఈ నెల 29న అనకాపల్లి వస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మూడు పార్టీల పొత్తు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. లంకెలపాలెం నుంచి సీఎం రమేష్‌ ఊరేగింపుగా నూకాలమ్మ ఆలయానికి వస్తారని తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు తెలిపారు. ప్రదర్శనలో అన్ని ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొవాలన్నారు. అనంతరం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నాయకులు పైలా ప్రసాదరావు, పీవీజీ కుమార్‌, ప్రగడ నాగేశ్వరరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఈర్ల శ్రీరామూర్తి, పొన్నగంటి అప్పారావు, వర్మ, సుందరపు విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని