logo

ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

Published : 28 Mar 2024 02:48 IST

గర్భిణులకు పండ్లు, రొట్టెలు అందిస్తున్న సినీనటుడు పృథ్వీరాజ్‌

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అభిమానుల సంఘం సభ్యులు పట్టణంలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణానికి విచ్చేసిన హాస్యనటుడు పృథ్వీరాజ్‌ వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో గర్భిణులకు అభిమానులతో కలసి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షులు మళ్ల శ్రీను మాట్లాడుతూ రామ్‌చరణ్‌ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర చిరంజీవి యువత అధ్యక్షులు గల్లా కొండలరావు, కొణతాల శ్రీను, కొమ్మోజు రాజు, తాడి రామకృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని