logo

ప్రచారానికి అనుమతి తప్పనిసరి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు.

Updated : 29 Mar 2024 05:58 IST

రాజకీయ పార్టీల సమావేశంలో కలెక్టర్‌ వెల్లడి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, నియోజకవర్గ స్థాయిలో ఆర్‌వోలు అనుమతులు ఇస్తారన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌  మాట్లాడారు. పలు పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేశారు. ఏప్రిల్‌ 14 వరకు ఓటరు నమోదు, సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 27 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 19,80,194కు చేరిందన్నారు. ఇప్పటివరకు 4,67,049 ఎపిక్‌ కార్డులను పంపిణీ చేశామన్నారు.

ఎన్నికల నియమావళి అమలుకు జిల్లాలో 89 బృందాలను నియమించామన్నారు. వివిధ ఘటనలకు సంబËంధించి 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి 26 ఫిర్యాదులు అందగా 25 పరిష్కరించామని, ఒకటి పెండింగ్‌లో ఉందన్నారు. ఈనెల 31న జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, తద్వారా ఓటర్లు వారి పోలింగ్‌ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చునన్నారు. సమావేశంలో డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

 మీడియా సమావేశాలకు సైతం: హోటళ్లు, కల్యాణ మండపాలు, ఇతర ప్రైవేటు ప్రదేశాల్లో నాయకులు నిర్వహించే మీడియా సమావేశాలు, విందు పేరుతో ఏర్పాటు చేసే ఆత్మీయ సమావేశాలకు సైతం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే ఎంసీసీ బృందాలు ఆయా ప్రదేశాలను సందర్శించి సమావేశాలు నిలిపివేస్తారు. ఈసీ ఆదేశాల మేరకు రాజకీయ పరమైన అంశాలపై చర్చించే ఎటువంటి సమావేశానికైనా అనుమతి తప్పనిసరి. వీజేఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో గురువారం ఓ రాజకీయ పార్టీ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. అనుమతి లేని కారణంగా దాన్ని నిలిపివేశారు. పార్టీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రెస్‌ మీట్లు, ఇతర సమావేశాలకు ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని