logo

ఆర్టీసీ గల్లాపెట్టె గలగల!

ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఏప్రిల్‌ 15 నుంచి వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చివరి సోమవారమైన ఈ నెల 27న రీజియన్‌కు రూ.2కోట్ల ఆదాయం.....

Published : 30 Jun 2022 06:14 IST

న్యూస్‌టుడే, హనుమకొండ చౌరస్తా

ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఏప్రిల్‌ 15 నుంచి వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చివరి సోమవారమైన ఈ నెల 27న రీజియన్‌కు రూ.2కోట్ల ఆదాయం తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించుకుని ‘మండే ఛాలెంజ్‌’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టారు. వరంగల్‌ రీజియన్‌లోని సిబ్బంది, అధికారులు 100 శాతం కృషి ఫలితంగా లక్ష్యాన్ని మించి రూ.2.01కోట్ల ఆదాయం తీసుకువచ్చారు. ఆషాడమాసం, విద్యాసంస్థలు తెరుచుకోవడంతో పాటు అధికారులు ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్డ్‌ ప్రకారం అన్ని రూట్లలో బస్సులను నడిపించారు. అన్ని పాయింట్ల వద్ద సిబ్బందిని ఉంచి ప్రయాణికుల అవసరం మేరకు సర్వీస్‌లు నడిపించి అనుకున్న ఆదాయం సంపాదించారు. సాధారణంగా వరంగల్‌ రీజియన్‌ నుంచి నిత్యం 980 బస్సులు వివిధ ప్రాంతాలకు నడిస్తే రోజుకు రూ.కోటి నుంచి రూ.1.20కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలాంటిది సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయం రూ.2కోట్లు దాటడం గమనార్హం. ఇందులో కేవలం టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.84 కోట్లు, సెస్‌, ఇతర సేవల ద్వారా వచ్చిన ఆదాయం రూ.16,79,885గా ఉంది.

అధికారులు, సిబ్బంది కృషితోనే.. : - వి.శ్రీదేవి, రీజనల్‌ మేనేజర్‌

ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లోని అన్ని డిపోల అధికారులు, సిబ్బ ంది సమష్టి కృషితోనే ఈ విజయం సాధించాం. ఉద్యోగులు సంస్థ ఆదాయం పెంచడానికి పోటీపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఇదే స్ఫూర్తితో పని చేసి ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ సంస్థ ఆదాయాన్ని పెంచుతూ ప్రయాణికులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలను అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని