logo

ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు

రాష్ట్రస్థాయి వెటరన్‌ టెన్నిస్‌ పోటీలు ముగిశాయి. ఆదివారం హనుమకొండలోని క్లబ్‌లో జరిగిన ఫైనల్స్‌ పోరులో వెటరన్‌ క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు.

Published : 28 Nov 2022 05:04 IST

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి వెటరన్‌ టెన్నిస్‌ పోటీలు ముగిశాయి. ఆదివారం హనుమకొండలోని క్లబ్‌లో జరిగిన ఫైనల్స్‌ పోరులో వెటరన్‌ క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్‌-30, 35ప్లస్‌, 45ప్లస్‌, 55ప్లస్‌, 65ప్లస్‌ విభాగాల్లో డబుల్స్‌ పోటీలు జరిగాయి. ముగింపు వేడుకలకు నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వరంగల్‌ క్లబ్‌ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, టెన్నిస్‌ సంఘం అధ్యక్షులు ప్రభాకర్‌రావు, కార్యదర్శి ఇలమురుగు, కోశాధికారి రవీంద్రనాథ్‌, మీడియా కన్వినర్‌ డా.జయసింహారెడ్డి, కోచ్‌ జగదీష్‌ పాల్గొన్నారు.

విజేతలు: 65విభాగంలో పురుషోత్తంరెడ్డి, స్వామి(విన్నర్‌, వరంగల్‌ జిల్లా), రన్నర్స్‌ ప్రదీప్‌, రవీందర్‌రెడ్డి( వరంగల్‌ జిల్లా), 55విభాగంలో విన్నర్స్‌ బాపురెడ్డి, ఇలమురుగు(వరంగల్‌ జిల్లా), రన్నర్స్‌ రవీంద్రనాథ్‌, రాజేశ్వర్‌రావు(వరంగల్‌ జిల్లా), 45విభాగంలో విన్నర్స్‌ సలీం, వెంకటేశ్వర్లు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), రన్నర్స్‌ శ్రీనివాస్‌, సత్యనారాయణ(ఖమ్మం) 35 విభాగంలో విన్నర్స్‌ ఆరిఫ్‌, కబీర్‌(భద్రాద్రి కొత్తగూడెం), రన్నర్స్‌ లక్ష్మణ్‌, భాస్కర్‌(భద్రాద్రి కొత్తగూడెం), 30 విభాగంలో విజేతలు రామచంద్రారెడ్డి, నిఖిల,్ రన్నర్స్‌ నిషాంత్‌, గిరీష్‌(నిట్, వరంగల్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని