logo

ఎన్ని మార్పులో..?

మహబూబాబాద్‌ శాసనసభ నియోజకవర్గం 2009లో పునర్విభజనకు ముందు ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 77 గ్రామాల్లో విస్తరించింది.

Published : 02 Nov 2023 04:11 IST

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ శాసనసభ నియోజకవర్గం 2009లో పునర్విభజనకు ముందు ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 77 గ్రామాల్లో విస్తరించింది. మహబూబాబాద్‌ మండలంలో (14 గ్రామాలు), నెల్లికుదురు (11), కేసముద్రం(17), గూడూరు(10), నెక్కొండ(17), పర్వతగిరి(1), చెన్నరావుపేట(4), కొత్తగూడ(3) మండలాల్లోని కొన్ని గ్రామాలు ఉండేవి..నాడు ఒక మండలంలో కొన్ని గ్రామాలు ఒక్క నియోజకవర్గంలో ఉంటే మరికొన్ని గ్రామాలు వేరే నియోజకవర్గంలో ఉండేవి. పునర్విభజన తర్వాత చాలా వరకు మండల పరిధిలోని గ్రామాలన్నీ ఒకే నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి. దంతాలపల్లి మండలానికి సంబంధించిన ఒక బొడ్లాడ గ్రామం మహబూబాబాద్‌ పరిధిలోకి రాగా మిగిలిన గ్రామాలు డోర్నకల్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మహబూబాబాద్‌ (40), గూడూరు(39), కేసముద్రం(40), నెల్లికుదురు(36), ఇటీవల ఏర్పాటైన ఇనుగుర్తి మండలాల్లోని గ్రామాలు పూర్తిగా ఉన్నాయి. దంతాలపల్లి మండల పరిధిలోని ఒక్క గ్రామంతో కలిపి ప్రస్తుతం నియోజకవర్గంలో 157 పంచాయతీలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని