logo

కోతలతో కోలుకోలేనంత నష్టం

వేళాపాళా లేకుండా గంటల తరబడి విధిస్తున్న విద్యుత్తు కోతలతో కోలుకోలేని స్థాయిలో నష్టపోతున్నామంటూ రొయ్యల సాగుదారులు ఆందోళన బాటపట్టారు. ధర్మాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన రొయ్యల సాగుదారులు, పలువురు వైకాపా నాయకులు

Published : 28 May 2022 04:47 IST

రొయ్యల రైతుల ఆందోళన

ఆకివీడు: ఉపకేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న ఆక్వా సాగుదారులు

ఆకివీడు, న్యూస్‌టుడే: వేళాపాళా లేకుండా గంటల తరబడి విధిస్తున్న విద్యుత్తు కోతలతో కోలుకోలేని స్థాయిలో నష్టపోతున్నామంటూ రొయ్యల సాగుదారులు ఆందోళన బాటపట్టారు. ధర్మాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన రొయ్యల సాగుదారులు, పలువురు వైకాపా నాయకులు ఆకివీడులో విద్యుత్తు ఉప కేంద్రం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సుమారు 10 గంటల నుంచి విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో చెరువుల్లో ప్రాణవాయువు సమస్య ఉత్పన్నమై టన్నుల కొద్ది రొయ్యలు చనిపోయాయని పలువురు రైతులు ఏఈ ప్రసాద్‌రాజుకు చెప్పారు. సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయాలని.. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైకాపా కౌన్సిలర్లు కె.జాన్‌వెస్లీ, పడాల శ్రీనివాసరెడ్డి, లాజర్‌, కుమార్‌, రాజేష్‌, వేగేశ్న రామరాజు, కంతేటి రామరాజు, నాగేంద్ర తదితర ఆక్వారైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని