logo

ముంపులోనే ఇళు

గోదారమ్మ కాస్త శాంతించినప్పటికీ వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద 52 అడుగులకు చేరుకున్న వరద బుధవారం నుంచి క్రమేపీ తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 46 అడుగులకు చేరుకుంది.

Published : 16 Aug 2022 05:38 IST


గుడారాల్లో తలదాచుకుంటున్న రుద్రంకోటవాసులు

వేలేరుపాడు, న్యూస్‌టుడే: గోదారమ్మ కాస్త శాంతించినప్పటికీ వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద 52 అడుగులకు చేరుకున్న వరద బుధవారం నుంచి క్రమేపీ తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 46 అడుగులకు చేరుకుంది. అయినా కట్కూరు, కొయిదా పంచాయతీల పరిధిలోని 17 గ్రామాలతో పాటు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, రుద్రంకోట, తిరుమలాపురం, చిగురుమామిడి, తూర్పుమెట్ట గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. రుద్రంకోట, వేలేరుపాడు, నార్లవరం, తిరుమలాపురం గ్రామాల్లోని పలు ఇళ్లు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గ్రామాలకు వెళ్లే దారి లేకపోవడంతో వేలాది మంది బాధితులు గుడారాల్లోనే జీవనం సాగిస్తున్నారు. రుద్రంకోట, చిగురుమామిడి, నార్లవరం, తిరుమలాపురం గ్రామాల ప్రజలు తాగునీరు, ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. చిన్న పడవలపై అతికష్టం మీద శివకాశీపురం, భూదేవిపేట గ్రామాలకు వెళ్లి నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు.

దిగువకు 10.85 లక్షల క్యూసెక్కుల వరద
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 33.60 మీటర్లకు చేరింది. స్పిల్‌వేలోని 48 గేట్ల నుంచి దిగువకు 10.85 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోంది. ఏ మాత్రం వర్షం కురిసినా పోలవరానికి వెనుక భాగంలో ముంపు మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని