logo

వస్తున్నారు.. వెళ్తున్నారు.. తప్ప.. ఉపయోగం లేదు

ఎమ్మెల్యే గారు వస్తున్నారు.. హామీ ఇచ్చి వెళ్తున్నారు.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ద్వారకాతిరుమల మండలం వేంపాడు వాసులు ఎంపీ మార్గాని భరత్‌ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’

Updated : 17 Aug 2022 06:43 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో నేతలకు నిరసన సెగ


సచివాలయం సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే గారు వస్తున్నారు.. హామీ ఇచ్చి వెళ్తున్నారు.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ద్వారకాతిరుమల మండలం వేంపాడు వాసులు ఎంపీ మార్గాని భరత్‌ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజా సమస్యలు తెలుసుకుంటుండగా..  ఎన్నికల ముందు పక్కా ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అది  నెరవేరలేదని.. తాటాకింట్లోనే కాలం వెళ్లదీస్తున్నామని దేవి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గృహ నిర్మాణ పథకంలో కూడా రుణం మంజూరు చేయలేదని వాపోయారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని, మురుగు పారక దోమలు విజృంభిస్తున్నాయని పలువురు తెలిపారు. పంచాయతీ అధికారులు అందుబాటులో ఉండటం లేదని  ఆరోపించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సచివాలయం అధికారులకు ఎంపీ భరత్‌ సూచించారు. కార్యక్రమంలో నాయకులు ప్రతాపనేని వాసు, బొండాడ వెంకన్నబాబు, గుర్రాల లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని