logo

ఈ పిట్ట.. విహారంలో దిట్ట

మనదేశంతో పాటు ఆఫ్రికా, ఐరోపా, రష్యా, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాల్లో కనిపించే ‘గ్రేహెరాన్‌’ పక్షిని స్థానికంగా నారాయణ పక్షిగా పిలుస్తారు.

Published : 27 Nov 2022 04:30 IST

కొల్లేరు అతిథి

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మనదేశంతో పాటు ఆఫ్రికా, ఐరోపా, రష్యా, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాల్లో కనిపించే ‘గ్రేహెరాన్‌’ పక్షిని స్థానికంగా నారాయణ పక్షిగా పిలుస్తారు. సుమారు 90 సెం.మీ నుంచి 98 సెం.మీ పొడవు ఉండి 2 నుంచి 3 కిలోల బరువు ఉండే ఈ పక్షి.. తెలుపు, నలుపు, బూడిద వర్ణాలతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. శీతాకాలంలో మూడు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటుంది. కొల్లేరు ప్రాంతంలో అయిదు వేల వరకు వీటి సంతతి ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు