logo

వైకాపా కౌన్సిలర్‌ రౌడీయిజం

తన కుటుంబం అంతుచూస్తానని నరసాపురానికి చెందిన వైకాపా నాయకుడు జిల్లెళ్ల దిలీప్‌కుమార్‌ బెదిరించారని అదే ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు గంటా కృష్ణ ఆరోపించారు.

Published : 29 Nov 2022 05:47 IST

ఫిర్యాదిచ్చినా స్పందించని పోలీసులు : జనసేన

మాట్లాడుతున్న గంటా కృష్ణ,  కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే:  తన కుటుంబం అంతుచూస్తానని నరసాపురానికి చెందిన వైకాపా నాయకుడు జిల్లెళ్ల దిలీప్‌కుమార్‌ బెదిరించారని అదే ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు గంటా కృష్ణ ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ కాలనీలో సోమవారం జనసేన నాయకులు, కౌన్సిలర్‌లు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో కృష్ణ మాట్లాడారు.  నరసాపురంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా బహిరంగ సభా ప్రాంగణం వద్ద  ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిని తాను చించి వేశానంటూ 26వ వార్డు కౌన్సిలర్‌ జిల్లెళ్ల దిలీప్‌కుమార్‌.. తాను ఇంట్లో లేని సమయంలో ఈ నెల 26న శనివారం రాత్రి  అనుచరులతో ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడి, దౌర్జన్యం చేసి తనను, తన కుటుంబం అంతుచూస్తానని బెదిరించాడని కృష్ణ తెలిపారు. అతని నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.   ఈ ఘటనపై   అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంత వరకు విచారణ చేసి కేసు నమోదు చేయలేదన్నారు.   జనసేన పట్టణాధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైకాపా కౌన్సిలర్‌ చేసిన దౌర్జన్యాన్ని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.   ఈ సందర్భంగా కృష్ణ కుటుంబ సభ్యులను కౌన్సిలర్‌ దిలిప్‌కుమార్‌ దుర్భాషలాడిన మాటల ఆడియోను విలేకరుల సమావేశంలో వినిపించారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని