logo

అనుమానమే నిజమైంది!

ఆచంట మండలం కొడమంచిలికి చెందిన జక్కంశెట్టి నాగబాబు(22) అదృశ్యమైన ఘటన తెలిసిందే.. సిద్ధాంతం వంతెన వద్ద ద్విచక్రవాహనం ఉండటంతో గోదావరిలోకి దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, బంధువులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు.

Published : 01 Feb 2023 05:18 IST

గోదావరిలో నాగబాబు మృతదేహం

సిద్ధాంతం (పెనుగొండ గ్రామీణ), న్యూస్‌టుడే: ఆచంట మండలం కొడమంచిలికి చెందిన జక్కంశెట్టి నాగబాబు(22) అదృశ్యమైన ఘటన తెలిసిందే.. సిద్ధాంతం వంతెన వద్ద ద్విచక్రవాహనం ఉండటంతో గోదావరిలోకి దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, బంధువులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గోదావరిలో నాగబాబు మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. సూర్యనారాయణ, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కుమార్తెకు వివాహమైంది. నాగబాబు చిన్నవాడు. నాగబాబు తండ్రికి సొంతగా లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఉంది. తండ్రికి చేదోడుగా ఉంటూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. చేతికందొచ్చిన కొడుకు గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.  గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పెనుగొండ ఎస్సై రమేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని