logo

డిమాండ్ల సాధనకు ఉద్యమం

సమస్యలు చెబుదామంటే వినకపోగా నిర్బంధాలకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు.

Published : 07 Feb 2023 06:00 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సాబ్జీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సమస్యలు చెబుదామంటే వినకపోగా నిర్బంధాలకు గురి చేయడం దారుణమని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు సంరక్షణకు పాటుపడుతున్న అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారికి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బందికి చరవాణులు ఇచ్చిన ప్రభుత్వం వివిధ రకాల యాప్‌లలో వివరాల నమోదు పేరిట వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి కళ్యాణి, సీఐటీయూ నాయకులు వాసుదేవరావు, పీవీ ప్రతాప్‌ తదితరులు మాట్లాడుతూ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా శిబిరానికి వచ్చిన ఐసీడీఎస్‌ పీడీ సుజాతరాణికి సమస్యలు వివరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిణి కృష్ణవేణికి వినతిపత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని