కదులుతున్న అవినీతి డొంక!
పెనుమంట్ర వైకేపీ(వెలుగు శాఖ) పరిధిలో ఆర్థిక, ఇతర అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అవినీతి డొంక కదులుతుందని ప్రజా సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.
‘ఈనాడు’ కథనాలతో ఉన్నతాధికారుల ఆరా
పెనుమంట్ర, న్యూస్‌టుడే: పెనుమంట్ర వైకేపీ(వెలుగు శాఖ) పరిధిలో ఆర్థిక, ఇతర అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అవినీతి డొంక కదులుతుందని ప్రజా సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. స్థానిక కార్యాలయ పరిధిలో అవకతవకలపై ‘ఈనాడు’ గత నెల 30 నుంచి మూడు రోజుల పాటు వరుస కథనాలు ప్రచురితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో వీటిపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీవోఏలకు వచ్చిన స్త్రీనిధి ఇన్‌సెంటివ్ సొమ్మును బెదిరింపులతో లాగేసిన అధికారి వ్యవహారంపై కొంత సీరియస్‌గా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో సదరు అధికారి స్థానికంగా తనకు కొంత అనుకూలమైన వాతావరణం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సొమ్ములు గోల్‌మాల్ చేసి బదిలీపై వెళ్లిన, సంతకాలు ఫోర్జరీ చేసిన క్లస్టర్ ఉద్యోగులపై సైతం చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరినట్లుగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1
-
Canada: భారత్ విజ్ఞప్తులు బుట్టదాఖలు.. ‘మోస్ట్ వాంటెడ్’లకు స్థావరంగా కెనడా!