logo

రాష్ట్రం వాటా ఇవ్వదు... పనులు సాగవు

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.

Published : 10 Mar 2024 04:11 IST

చించినాడ నుంచి దిండి వరకు వశిష్ఠ గోదావరిపై అసంపూర్తిగా రైలు వంతెన నిర్మాణ పనులు

ఈనాడు, ఏలూరు: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. 57.21 కి.మీ. పనులు చేపట్టే ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన మూడు వంతెనల్లో మొదటిది పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా దిండి వరకు వశిష్ఠ గోదావరిపై 20 పిల్లర్లతో వంతెన నిర్మాణం. రెండోది ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య గౌతమి నదిపై 45 పిల్లర్లతో నిర్మాణం.  వైనతేయ నదిపై 21 పిల్లర్లతో పాసర్లపూడి- బోడసకుర్రు మూడో వంతెన పనులు చేపట్టారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.పనులు పూర్తయితే కోనసీమ రైల్వేలైను ఏర్పడుతుంది. మెయిన్‌లైన్‌ ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.

నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం బ్రిటిష్‌ హయాంలో ప్రతిపాదించారు. చాలా ఏళ్లు  సర్వేలకే పరిమితమైంది. అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి  తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అనంతరం రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాగా రూ.525 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం తనవాటా నిధులు ఇవ్వక, భూసేకరణ కొలిక్కిరాక ప్రాజెక్టు పడకేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని