logo

‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్‌ తెలిపారు. తపాలా బ్యాలెట్‌ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.

Published : 25 Apr 2024 06:21 IST

డీఆర్వో ఉదయభాస్కరరావు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్‌ తెలిపారు. తపాలా బ్యాలెట్‌ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా బ్యాలెట్‌ను మే 6, 7, 8 తేదీల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల ద్వారా వినియోగించుకోవచ్చన్నారు. 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని తెలిపారు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఇప్పటి వరకు 1133 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. స్వీప్‌ నోడల్‌ అధికారి ప్రభాకర్‌, అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఆర్టీసీ, పోలీస్‌, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సహాయ కేంద్రం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేసేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉంటే 81216-76653 నంబరుకు ఫోన్‌ చేయొచ్చని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని