logo

సీఎంను విమర్శించడం తగదు : ఎంపీ

సీఎంను విమర్శించడం తగదని ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ దుయ్యబట్టారు. దేవరపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కనీసం వార్డు

Published : 21 Jan 2022 05:20 IST

బంక్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ భరత్‌రామ్‌, ఎమ్మెల్యే వెంకట్రావు

దేవరపల్లి, న్యూస్‌టుడే: సీఎంను విమర్శించడం తగదని ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ దుయ్యబట్టారు. దేవరపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కనీసం వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి గెలుపించారన్నారు. రాఘురామకృష్ణంరాజు రాజకీయాల్లో కమెడియన్‌ అని, ఆయన మాటల వల్ల జగన్‌కు ఇమేజ్‌ పెరుగుతుంది తప్ప పోయేది ఏమి లేదన్నారు. గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం దుద్దుకూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించారు. దాత సహకారంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షుడు కాండ్రు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడారు. నియోజకవర్గంలో అన్ని సొసైటీల్లోనూ బంక్‌లు ఏర్పాటు చేసి ఆదాయం పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. ఏఎంసీ ఛైర్మన్‌ జనార్దనరావు, ఎంపీపీ దుర్గారావు, వైస్‌ ఎంపీపీలు సుబ్బారావు, అరుణ, నాయకులు రాజేంద్రప్రసాద్‌, జగదీష్‌, సతీష్‌ అనసూయ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని