logo

రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు.

Published : 29 Mar 2024 05:24 IST

 బస్సుల కోసం కడప ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల పడిగాపులు
కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన సభకు జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో 90 బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. నంద్యాలలో గురువారం నిర్వహించిన సభకు కూడా జిల్లా వ్యాప్తంగా 80 బస్సులను పంపించారు. తర్వాత ఎమ్మిగనూరులో సభ ఉంది. అది ముగిసిన తరువాత ఆదివారానికి అవి కడపకు వస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బస్సుల కొరత ఏర్పడింది. డైలీ సర్వీసులు లేకపోవడంతో బస్టాండులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. రాయచోటి, నెల్లూరు, పులివెందుల, అనంతపురం, తదితర ప్రాంతాలకు బస్సుల్లేక నానా ఇబ్బందులు పడ్డారు. రోజువారీ విధులకు వెళ్లే వారు సొంత వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని