logo

రామయ్యను దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బుధవారం సందర్శించారు.

Published : 18 Apr 2024 03:46 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బుధవారం సందర్శించారు. ఆయనకు తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ్య రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తెదేపా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు వేర్వేరుగా స్వామివార్లను దర్శించుకున్నారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి గీత కుటుంబ సమేతంగా సందర్శించారు.  


బ్రహ్మోత్సవాల్లో నేడు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం 4-4.30 గంటల వరకు సుప్రభాత సేవ ఉంటుంది. ఆలయాన్ని దర్శించే భక్తులకు ఉదయం 5.30-6.30, ఆ తర్వాత 7-10.30 గంటల దాకా దర్శనం ఉంటుంది. శ్రీరామచంద్రుడు వేణుగాణాలంకారంలో దర్శనమిస్తారు. గ్రామంలో ఉదయం 7.30-9.30 గంటల వరకు గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. మళ్లీ 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు, 5-10.30 వరకు దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి హంస వాహనంపై రామయ్య విహరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు