logo

చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి : నల్లారి

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 18 Apr 2024 03:49 IST

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కలికిరిలోని భాజపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో గతంలో బీటీ కళాశాల అభివృద్ధితో పాటు సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించి ప్రతి గ్రామానికీ తాగునీరందిచేందుకు కండలేరు ప్రాజెక్టు నుంచి 6.6 టీఎంసీల నీటిని కేటాయించామన్నారు. పైపులైన్ల ఏర్పాటుకు రూ.7,200 కోట్లు నిధులు మంజూరు చేయగా, వివిధ కారణాలతో ఆ పనులు రద్దయిన విషయం తెలిసిందేనన్నారు. అనంతరం మదనపల్లెకు చెందిన వైకాపా చేనేత రీజినల్‌ కోఆర్డినేటర్‌ భవనేశ్వరి సత్య తన అనుచరులు 250 మందితో కలిసి భాజపాలో చేరారు. అయిదేళ్ల వైకాపా పాలనలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో చేరినట్లు వారంతా తెలిపారు. వీరబల్లికి చెందిన సింగల్‌విండో అధ్యక్షుడు కల్లూరి రామ్మోహన్‌రెడ్డి తన 40 మంది అనుచరులతో కలిసి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. సుండుపల్లె మండలం గుంతరాజుపల్లెకు చెందిన ఎస్‌.మహేశ్వర్‌రాజు తన అనుచరులు 10 మందితో కలిసి భాజపాకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భాజపా మదనపల్లె కన్వీనర్‌ భగవాన్‌, పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు