icon icon icon
icon icon icon

YS Sharmila: న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్‌ షర్మిల

జగన్‌ హామీలన్నీ ఫ్యాన్‌ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. 

Updated : 04 May 2024 16:24 IST

కడప: జగన్‌ హామీలన్నీ ఫ్యాన్‌ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా వైకాపా ముఖ్యులంతా ఓ ముఠాగా ఏర్పడి అధికారాన్ని అక్రమాల కోసం వినియోగించారని విమర్శించారు. కడప అభివృద్ధిని విస్మరించి, కనీసం తాగునీటిని కూడా ఇవ్వని వైకాపా నాయకులకు ఓటెందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు.

‘‘అంజాద్‌ బాషా, మల్లికార్జున్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి అందరూ దోపిడీదారులే. కడపలో వైకాపా చేసిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. రాజధాని లేదు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడంలేదు. న్యాయం కోసం వైఎస్‌ వివేకానంద రెడ్డి ఆత్మ ఘోషిస్తోంది. చట్టసభలకు నిందితులు రావొద్దనే నేను పోటీ చేస్తున్నా. కడప ఎంపీగా నన్ను గెలిపించాలని కోరుతున్నా. ఎంపీగా రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కావాలో.. వివేకాను హత్య చేయించిన అవినాష్‌రెడ్డి కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని షర్మిల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img