icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.3 వేలు

తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించే కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించకూడదు.

Published : 05 May 2024 06:44 IST

వైకాపా తాయిలం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించే కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించకూడదు. శనివారం కాకినాడ జిల్లాలోని చాలా కేంద్రాల్లో ఉద్యోగులు సెల్‌ఫోన్లతో వెళ్లారు. వారిని రిటర్నింగ్‌ అధికారులు నియంత్రించలేదు. కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ కేంద్రంలోకి ఓటర్ల వెంట సెల్‌ఫోన్లు తీసుకెళ్లారు. కొందరు ఓటేసిన బ్యాలెట్‌ ఫొటోలు తీసి వైకాపా నాయకులకు పంపారు. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. సమాచారం అందుకున్న కాకినాడ నగర నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు ఉదయం పదిన్నర తరువాత సెల్‌ఫోన్లను నియంత్రించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img