icon icon icon
icon icon icon

1న ఇళ్లకే పింఛను అందకపోతే.. ప్రభుత్వ కుట్ర ఉన్నట్లే: పవన్‌

‘లబ్ధిదారులకు మే ఒకటో తేదీన ఇళ్ల వద్దే పింఛన్లు అందకపోతే, దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లే నమ్మాల్సి వస్తుంది.. అధికారులు అడ్డంకులు కల్పించకపోతే.. పింఛను ఇళ్లకే చేరుతుంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 24 Apr 2024 07:41 IST

ఈనాడు, కాకినాడ: ‘లబ్ధిదారులకు మే ఒకటో తేదీన ఇళ్ల వద్దే పింఛన్లు అందకపోతే, దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లే నమ్మాల్సి వస్తుంది.. అధికారులు అడ్డంకులు కల్పించకపోతే.. పింఛను ఇళ్లకే చేరుతుంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నామినేషన్‌ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని.. ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు.. భవిష్యత్తు తరాలకూ కీలకమైనవని అన్నారు. వైకాపా ప్రభుత్వ చేతిలో నలిగిపోయిన మీడియాకు అండగా ఉంటామని తెలిపారు. గతంలో ముక్కోణపు పోటీ ఉండేదని.. ఇప్పుడు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం వల్ల సమస్యలపై బలమైన పోరాటానికి అవకాశం ఏర్పడిందన్నారు. జనసేన మిగిలిన పార్టీలతో సమంగా బలం పుంజుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసమే త్యాగాలు చేయాల్సి వచ్చిందని పవన్‌ గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం సీటును వర్మ తన కోసం త్యాగం చేశారని.. భవిష్యత్తులో ఆయనకు ఉన్నతస్థానం దక్కేలా కృషి చేస్తానన్నారు. కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా టీ టైమ్‌ వ్యవస్థాపకులు ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారని.. ఇలాంటివారు ఎన్నికైతే మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలకు కృషి చేస్తారని తెలిపారు. ఓఎన్‌జీసీ కాలుష్యం వంటి అంశాలపై పార్లమెంటులో బలంగా గళం విప్పగలరని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img