icon icon icon
icon icon icon

పులివెందులలో సీఎం జగన్‌ నామినేషన్‌ దాఖలు నేడు

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల వైకాపా అభ్యర్థిగా సీఎం జగన్‌ గురువారం నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

Published : 25 Apr 2024 06:22 IST

పులివెందుల, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల వైకాపా అభ్యర్థిగా సీఎం జగన్‌ గురువారం నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. సీఎం జగన్‌ గురువారం ఉదయం 8.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 9.05 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 9.10 నిమిషాలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.50 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎస్‌ఐ మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. 11.25 నుంచి 11.40 గంటల మధ్య పులివెందులలోని మినీ సెక్రటేరియట్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలు అందించనున్నారు. 11.45 గంటలకు భాకరాపురంలోని తన ఇంటికెళ్లి 12.15 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో 2.30 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img